InternationalNews

పాకిస్తాన్‌పై జింబాబ్వే ఘన విజయం

టీ20 వరల్డ్‌ కప్‌లో పెను సంచలనాలు జరుగుతున్నాయి. పసికూన టీంలు చెలరేగి ఆడుతున్నాయి. తాజాగా.. జింబాబ్వే పాకిస్తాన్‌పై ఘన విజయాన్ని సాధించింది. ఒక రన్‌ పరుగు తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. తన అద్భుత ప్రదర్శనతో పాకిస్తాన్‌ కట్టడి చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 130/8 పరుగులు చేసింది. పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. పాకిస్తాన్‌ బ్యాటింగ్‌లో షాన్‌ మసూద్‌ తప్ప ఎవరూ కూడా రాణించలేదు. మసూద్‌ 44 పరుగులు చేసి ఔటయ్యాడు. మహ్మద్‌ నవాజ్‌ (22), షాదాబ్‌ ఖాన్‌ (17),  మహ్మద్‌ వసీం (12) పరుగులు చేశారు. జింబాబ్వే అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. సికందర్‌ రజా మూడు వికెట్లు తీయగా బ్రాడ్‌ ఎవెన్స్‌ రెండు వికెట్లు పడగొట్టారు. బ్లెస్సింగ్‌ ముజరాబని, లుక్‌ జుగ్‌వే తలో వికెట్‌ తీశారు.