NationalNews

అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్

ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన రుద్ర హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఉప్పర్ సియాంగ్ జిల్లాలోని మిగ్గింగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఘటనా స్దలం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. కాగా అక్కడికి చేరుకోవడానికి ఎటువంటి రోడ్డు మార్గం కూడా లేదు .దీంతో సహయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఘటనాస్థలానికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఆర్మీ బృందాలు సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ రుద్ర హెలికాప్ట్రర్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ కాగా దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది. రుద్ర హెలికాప్టర్ ధ్రువ అడ్వాన్స్‌డ్ హెలికాప్టర్ కంటే అత్యాధునికంగా ఉంటుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.