Andhra Pradesh

అమరావతిపై ఏపీ ప్రభుత్వ పిటిషన్‌కు సుప్రీంలో SLP కేటాయింపు

అమరావతి: మనసర్కార్

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో ఎంతకీ తేలకుండా అందర్నీ అయోమయానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు తీర్పిచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ SLP నంబరు కేటాయించింది. గతంలో హైకోర్టు తీర్పులో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపించాలని ఆదేశించింది. దీనిపై ఏపీ సర్కారు 2 వేల పేజీలతో ఎస్‌ఎల్‌పీని దాఖలు చేసింది.  ఈ పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంది. రేపటికైనా అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని అమరావతి రైతులు కూడా ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులకు రాష్ట్రప్రభుత్వ న్యాయవాదులు SLP కాపీని ఆన్ లైన్‌లో పంపించారు. ఈకేసు ధర్మాసనం ముందుకు ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.