కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలకు అడ్డుకట్ట వేస్తాం-శశిథరూర్
ప్రత్యామ్నాయ కూటమి కడతాం
బీజేపీలో చేరికలను అడ్డుకుంటాం…
కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా ఇదే లక్ష్యం
కాంగ్రెస్ పార్టీని వీడకుండా చూసుకుంటాం…
పార్టీలో యువత తనకే మద్దతంటున్న శశిథరూర్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శశి థరూర్, పార్టీలోని కొంతమంది అధికారిక అభ్యర్థి ఉన్నారని భావిస్తున్నారని.. అలాంటిది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో మల్లికార్జున్ ఖర్గేకు ఎక్కువ మంది మద్దతిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు శశిథరూర్. మొత్తం పరిణామాలను పార్టీ అంతర్గత వ్యక్తులు, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ఖర్గే, థరూర్లో ఎవరు గెలిచినా రెండు దశాబ్దాలలో గాంధీయేతర పార్టీ అధినేత అవుతారన్నారు.

ఖర్గే సార్ నా నాయకుడు కూడా అన్న శశిథరూర్… తాము శత్రువులం కాదన్నారు. . కాంగ్రెస్లో మార్పు కోసం నేను అభ్యర్థిగా బరిలో దిగానన్నారు. తనకు మద్దతు కూడగట్టేందుకు అస్సాంలోని గౌహతిలో పర్యటించారు. కాంగ్రెస్ చీఫ్గా ఎన్నికైతే తన మొదటి కర్తవ్యంగా పార్టీ నేతలను బీజేపీలో చేరకుండా ఆపడమేనని అన్నారు.
ఎన్నిక కోసం తనకు మద్దతిచ్చిన వ్యక్తులు తిరుగుబాటుదారులు కారని… వారెవరూ కూడా గాంధీలకు వ్యతిరేకం కాదన్నారు. ఇలా ఆలోచించడం తప్పు అన్నారు. గాంధీలు ఎప్పుడూ కాంగ్రెస్తోనే ఉన్నారని… ఉంటారన్నారు. 

ఎన్నికల్లో ఎవరు గెలిచినా గెలుస్తామనే స్ఫూర్తితో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని చెప్పుకొచ్చారు. కొత్త అధ్యక్షుడు భారతదేశ ప్రజల కోసం పని చేస్తారన్నారు. కొత్త అధ్యక్షుడి ప్రధాన కర్తవ్యాలలో ఒకటి 2024 నాటికి ఇతర పార్టీలను కలుపుకొని వెళ్లి విజయం సాధించడమమన్నారు. కొత్త జాతీయ కూటమిని ఏర్పాటు చేయడంపై మా మొదటి పరీక్ష అని చెప్పుకొచ్చారు.

