InternationalNews

ఆర్థిక మంత్రిపై వేటు వేసిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్

లిజ్ ట్రస్ సర్కారు వివాదాస్పద ఆర్థిక ప్రణాళికలతో బ్రిటన్ మార్కెట్ కుప్పకూలింది. పన్ను కోతల్లో ఏర్పడిన గందరగోళంతో ఆయనకు ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది. ఐతే మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ… తాను ఎక్కడికీ వెళ్లడం లేదంటూ బీరాలు పోయిన మంత్రిపై వేటు పడింది. లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక… క్వార్టెంగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. UK ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్‌ను తొలగించినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్‌కు ఆదిలోనే కష్టాలు ఎదురవుతున్నాయ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఓవైపు, ఆర్థిక కల్లోలం మరోవైపు ఆమెను వెంటాడుతున్నాయ్. పదవిని కాపాడుకోవడం కోసం ఆమె ఆర్థిక మంత్రిపై వేటు వేశారన్న వార్తలు గుప్పమంటున్నాయ్.