ఫిలింఫేర్ అవార్డ్స్‌లో కూడా ‘పుష్ప’ తగ్గేదేలే
‘సైమా’ అవార్డులలోనే కాదు ‘ఫిలింఫేర్’ అవార్డులలో కూడా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా తగ్గేదేలేదనిపించింది. నిన్న ఆదివారం రాత్రి బెంగళూరులో 67వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ఎంతో వేడుకగా జరిగింది. ఈసారి ఫిలింఫేర్లో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించి పుష్ప చిత్రం ఏకంగా ఏడు విభాగాలలో సత్తా చాటింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌లకు ఈ ఏడాది ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. తమిళంలో సూర్య కథానాయకుడిగా నటించిన ‘సూరారై పోట్రు’ చిత్రం కూడా పుష్పతో సమానంగా ఏడు అవార్డులను దక్కించుకుంది.

తెలుగులో ఫిలింఫేర్ విజేతల వివరాలు
ఉత్తమచిత్రం : పుష్ప-ది రైజ్
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప-ది రైజ్)
ఉత్తమ నటుడు : అల్లుఅర్జున్ (పుష్ప-ది రైజ్)
ఉత్తమ నటి : సాయిపల్లవి( లవ్ స్టోరీ)
ఉత్తమ సహాయనటుడు: మురళీశర్మ( అల వైకుంఠపురంలో)
ఉత్తమ సహాయనటి: టబు( అలవైకుంఠపురంలో)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప-దిరైజ్)
ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి(జాను)
ఉత్తమ గాయకుడు: సిద్ధ్ శ్రీరామ్( పుష్ప ది రైజ్- శ్రీవల్లి)
ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్ ( పుష్ప ది రైజ్ – ఊ అంటావా మావ)
విమర్శకుల ఉత్తమ నటి: సాయిపల్లవి( శ్యామ్ సింగరాయ్)
విమర్శకుల ఉత్తమ నటుడు: నాని (శ్యామ్ సింగరాయ్)
ఉత్తమ కొరియో గ్రాఫర్: శేఖర్ మాస్టర్ ( అల వైకుంఠపురములో -రాములో రాములా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : మిరోస్లా బ్రౌజెక్ ( పుష్ప- ది రైజ్)
ఉత్తమ నూతన నటి : కృతిశెట్టి( ఉప్పెన)
ఉత్తమ నూతన నటుడు: వైష్ణవ్ తేజ్ ( ఉప్పెన)