NationalNews

ఆస్ట్రేలియాకు టీమిండియా పయనం

టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు పయనమయింది. టోర్నీకి బయల్దేరే ముందు టీమిండియా క్రికెటర్ల ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ల్లో గెలిచిన టీమిండియా చాలా ఉత్సాహంగా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫిల్డీండ్‌లో మంచి ఫామ్‌లో రాణిస్తుంది. టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.  6 నెలల వరకు బుమ్రాకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బుమ్రా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో అని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహమ్మద్‌ షమీ లేదా దీపక్‌ చాహర్‌లలో ఒకరికి బుమ్రా స్థానం దక్కించుకోనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి ఈ నెల 23న పాకిస్థాన్‌ తో టీమిండియా తలపడనుంది. సూపర్‌ -12లో టీమిండియా రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్‌ 17న ఆస్ట్రేలియా,  అక్టోబర్‌ 19న న్యూజిలాండ్‌తో తలపడనుంది.