NationalNews Alert

కృష్ణంరాజుకు అంతిమసంస్కారం చేయనున్న ప్రభాస్ బ్రదర్ ప్రభోద్

రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలకు సంబంధించిన పనులు పూర్తి కావోస్తున్నాయి. మెయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌ హౌస్‌లో ప్రభుత్వం లంఛానాలతో ఆయన అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. అయితే అంత్య క్రియలు ప్రభాస్ నిర్వహిస్తారని అందరు భావించారు. కానీ  ప్రభాస్ కాకుండా , అతని అన్న ఇంటికి పెద్ద కొడుకు ప్రభోద్ కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే ఈ కార్యక్రమం మొదలుకావాల్సి ఉన్నా… పండితుల సూచనలతో సమయంలో కొన్ని మార్పులు చేశారు.