టీఎంసీకి సీనియర్ నేత రాజీనామా
తృణమూల్ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గుడ్ బై చెప్పారు. త్రిపుర యూనిట్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ బాసిత్ ఖాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీఎంసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌కు అందించారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. టీఎంసీ పార్టీ ఉపాధ్యక్ష పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే.. టీఎంసీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా సుబల్ భౌమిక్‌ని తొలగించిన కొద్దిరోజులకే ఇలా.. బాసిత్ ఖాన్ గుడ్‌బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల గడువు మాత్రమే ఉండగా… ఈ పరిణామం చోటు చేసుకోవడం మమతా బెనర్జీకి ఆందోళన కలిగించే అంశంగా మారింది

