Andhra PradeshNews Alert

గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి- GVMC

వినాయక మండపాలకు అనుమతి ఉండాల్సిందేనన్నారు విశాఖ నగర పోలీస్ కమీషనర్ సీ.హెచ్, శ్రీకాంత్. నగరంలోని వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఉత్సవకమిటీలు సహకరించాలని కోరారు. మండపాలు ఏర్పాట్లు చేసేవారు తప్పకుండా సంబంధిత ఏసీపీ (ACP)  కార్యాలయంలో అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసారు. అనుమతులు కావాలంటే విద్యుత్, ఫైర్, పంచాయితీ, GVMC మొదలైన అన్ని శాఖల అనుమతి పత్రాలను జతచేయాలని సూచించారు. కొన్ని నిబంధనలు కూడా పాటించాలనే షరతును విధించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏమిటంటే

విగ్రహం సైజు, బరువు, ఉత్సవం జరిగే రోజులు, నిమర్జనం జరిగే తేదీని ముందుగానే పోలీసులకు తెలియపరచాలి.

బలవంతపు చందాలు, వసూళ్లకు పాల్పడరాదు. దర్శనాలకు టికెట్లు కూడా ఉండరాదు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకుండా వీలైనంత వరకూ మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేయాలి.

విద్యుత్ షార్ట్ సర్కూట్స్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

లౌడ్ స్పీకర్లు పెద్ద సౌండుతో ఏర్పాటు చేయరాదు.

CCTVలు ఏర్పాట్లు చేసుకోవాలి. మండపాలు ఉండే ప్రదేశాలలో ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా పార్కింగ్ స్థలాలు కేటాయించాలి.

నిమర్జన సమయంలో అశ్లీల పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, పేలుడు సామాగ్రి ఉపయోగించరాదు.

పై నిబంధనలను పాటించనివారిపై చర్యలు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమీషనర్ హెచ్చరించారు.