NewsTelangana

గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

బిల్కిస్‌ బానో కేసు నిందితుల్ని రిలీజ్‌ చేసిన అంశంపై గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 11 మంది నిందితుల విడుదల గురించి వివరణ ఇవ్వాలని గుజరాత్‌ సర్కార్‌ను సుప్రీంకోర్టు కోరింది. 2002లో గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచార ఘటన జరిగింది. ఆ కేసులో 11 మంది నిందితులుగా ఉన్నారు. అయితే… ఆగస్టు 15న బిల్కిస్‌ బానో రేప్‌ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది. కాలం చెల్లిన రెమిషన్‌ విధానం ప్రకారం వారిని గుజరాత్ ప్రభుత్వం రిలీజ్‌ చేసింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. గుజరాత్‌ ప్రభుత్వ తీరును విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు… నిందితుల రీలీజ్‌ చేయడంపై వివరణ ఇవ్వాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోరింది.