ఉక్రెయిన్‌కు పక్కలో బల్లెంలా మారిన అణురియాక్టర్లు – ఆందోళనలో కీవ్ ప్రజలు
అగ్రదేశాల మధ్య ఆధిపత్యపోరులో చిన్నచిన్న దేశాలు సమిధలుగా మారుతున్నాయి. రష్యా, అమెరికాపై కోపంతోనే ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిందని అందరకూ తెలుసు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకుని అణు యుద్ధం వస్తుందేమో అని ప్రపంచదేశాలకు భయం పుట్టిస్తోంది రష్యా. సోవియట్ కాలంలో నిర్మించిన జపొరియా భారీ అణు విద్యుత్తు కేంద్రం ఇప్పుడు కీవ్ నగరంలో బెంబేలు పుట్టిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలు కాగానే రష్యాసేనలు ఈకేంద్రాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అణు రియాక్టర్లపై కూడా దాడులు జరుపుతూ ఉక్రెయిన్‌నే కాదు యావత్తు ప్రపంచాన్నే భయపెడుతోంది. ఏక్షణాన అణుప్రమాదం చోటుచేసుకుంటుందో అని కీవ్ ఆందోళన చెందుతోంది. ఈ జపొరియా ప్లాంట్‌ను రష్యా బ్లాక్ మెయిలింగ్‌కు ఉపయోగిస్తోందని పాశ్చాత్యదేశాలు మండిపడుతున్నాయి. దానిని ఆదేశ గ్రిడ్ నుండి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమాత్రం తేడాలు జరిగినా చర్నోబిల్ కంటే ఘోరప్రమాదం చోటు చేసుకుంటుందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఛైర్మన్ డైరక్టర్ జనరల్ రఫేల్ మారినో గ్రోసీ హెచ్చరిస్తున్నారు.

ఈ జపొరియా అణు ఇంధనం లీకయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. ఈ రియాక్టర్‌లో వాడే ఇంధన కడ్డీలను చల్లబరచకపోతే అవి కరిగి లీకయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్లాంటును రష్యా ఎలక్ట్రిక్ గ్రిడ్‌కు అనుసంధానించే క్రమంలో డీజిల్ జనరేటర్లను వాడాల్సి ఉంటుంది. దీనికోసం అక్కడ మూడు జనరేటర్లను ఉంచారు. ఉక్రెయిన్‌లో మొత్తం 15 అణు రియాక్టర్లు పని చేస్తున్నాయి. ఇవి 51శాతం దేశ విద్యుత్ అవసరాలు తీరుస్తున్నాయి. రష్యాఅధీనంలోని క్రిమియాకు 140 మైళ్ల దూరంలో నీపర్ నది ఒడ్డున ఉంది. ఈ నది అవతలి ఒడ్డు ఉక్రెయిన్ అధీనంలో ఉంది. మార్చిలో రష్యా దళాలు ఈ ప్లాంటును ఆక్రమించాయి. ప్రస్తుతం ఆరు రియాక్టర్లకు గాను రెండు మాత్రమే పని చేస్తున్నాయి. రేడియో ధార్మికత అప్పట్లో లీక్ కాలేదు. కానీ దీని ప్రొటెక్షన్ డేటా ఐఏఈఏ (IAEA)కు అందలేదు. దీనితో తమ పరిశీలకులను అనుమతించాలని ఉక్రెయిన్ కోరుతోంది. ప్లాంట్లపై షెల్లింగ్‌కు రష్యా, ఉక్రెయిన్ ఒకదానిపై ఒకటి బురద జల్లుకుంటున్నాయి. రష్యా తమ ఆయుధాలను పెద్దఎత్తున మొహరించిందని ఉక్రెయిన్‌కు చెందిన ఎనర్జోఆటమ్ అధిపతి ఆరోపించారు. ఈ ప్లాంట్లకోసం పోరాటం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ యుద్ధం ఓ కొలిక్కివచ్చి ఏదేశమైనా వెనక్కు తగ్గితే కాస్త ప్రజలు ఊపిరిపీల్చుకుంటారు.

