అట్టహాసంగా వజ్రోత్సవ ముగింపు వేడుకలు
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత స్వతంత్ర వజ్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సీఎంకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మొదట మహాత్మాగాంధీ చిత్రపటానికి పూల మాల వేసి సీఎం నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, జెండావందనం చేశారు. దేశానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నేటితో వేడుకలు ముగియనుండగా.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముగింపు వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.

