కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం యత్నం
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం హైదరాబాద్‌లో ఉద్రిక్తతలకు దారి తీసింది. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ… ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. లిక్కర్ స్కాం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

