Breaking Newshome page sliderHome Page SliderTelangana

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌ విచారం

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రమాద స్థలానికి అధికారులు వెంటనే చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌, డీజీపీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.