Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsNews AlertTrending Todayviral

కేఏ పాల్ ఆమె విషయంలో హీరోనా.. కమెడియనా..!

కేఏ పాల్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అతని కామెడీ మాటలు. అతనిని ఒక రకంగా హాస్యంగానే చూస్తారు. కానీ ఎవరో సీరియస్ గా అనుకోరు. ఆయన ఏమి మాట్లాడినా జోక్ గానే భావిస్తారు. కానీ పాల్ మాత్రం కొన్ని విషయాలు సీరియస్ గానే చెబుతుంటాడు. ఆయన ఎక్కువగా మీడియా సమావేశాలు పెడుతూంటారు. నేను ఫలానా వారిని కలిశాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన పెద్ద నాయకుల గురించి చెబుతూంటే కామెడీ అని అంతా అనుకుంటారు. కానీ యెమెన్ లో జైలులో ఉన్న కేరళ నర్సు నిమిష ప్రియ విషయంలో ఆయన సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. తాజాగా యెమెన్ రాజధాని సనా నుంచి ఒక వీడియో సందేశం భారత్ కి పంపించారు అని తెలుస్తోంది. ఆ వీడియో ద్వారా నిముష ప్రియ సేఫ్ అని చెప్పారు. ఆమె మరణ శిక్ష రద్దు అయిందంటూ, ఆమె క్షేమంగానే భారత్ తిరిగి వస్తుందని చెప్పారు. ఆమె మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసిందని కేఏ పాల్ స్వయంగా ప్రకటించుకున్నారు. ఆమెని ఉరి శిక్ష నుంచి తప్పించేందుకు గత పది రోజులుగా రాత్రి, పగలూ కష్టపడ్డాను అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేశారు. తన ప్రయత్నాలకు యెమెన్ అధికారులు, భారత ప్రభుత్వం ఎంతో సహకరించాయని ఆయన చెప్పుకొచ్చారు. తాను చేసిన కృషి ఫలించిందని అన్నారు. నిమిష ప్రియను క్షేమంగా భారత్ కి తీసుకుని వెళ్ళడానికి భారత్ దౌత్య అధికారులు పంపించేందుకు అంగీకరించింది అని ఆయన అన్నారు. నిజానికి నిమిష ప్రియ విషయం చాలా క్లిష్టంగా మారింది. ఒక టైంలో ఆమె మరణం ఖాయమని అనుకున్నారు. కేంద్రం సైతం సుప్రీం కోర్టులో ఈ వ్యాజ్యం మీద మాట్లాడుతూ తాము చేయగలిగినంత చేశామని చెప్పుకొచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా ఆమె ఉరి శిక్ష రద్దు అయింది. ఇపుడు చూస్తే ఆమె క్షేమంగా భారత్ వస్తోందని పాల్ చెబుతున్నారు. యెమెన్ రాజధాని సనా నుంచి ఆయన వీడియో చేయడంతో సామాన్యుడు కాదని మరికొందరు అనుకుంటున్నారు. కేఏ పాల్ గత కొన్నేళ్ళుగా తెలుగు ప్రజల దృష్టిలో ఒక పొలిటికల్ కమెడియన్ గా మారిపోయారు. కానీ ఇపుడు నిమిష ప్రియ కేసు కనుక సక్సెస్ అయితే కేఏ పాల్ గ్రేట్ అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చేసిన దౌత్య పరమైన చర్యలు ఏమిటి అన్న దాని కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉన్నది. అయితే కేఏ పాల్ గతంలో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే అంతర్జాతీయ సంస్థను నిర్వహించి అనేక దేశాలు తిరిగిన అనుభవం ఉన్నది వాస్తవం అయినప్పటికీ ఆయన చేస్తున్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆయనను నమ్మలేకపొతున్నారు. ఏది ఏమైనప్పటికీ నిమిష ప్రియ కేసులో ఏమైనా అద్భుతాలు జరిగితే మాత్రం ఆ క్రెడిట్ తనదే అంటూ కేఏ పాల్ హీరోగా మారిపోతాడు. లేకపోతే మాత్రం మరో కమెడియన్ గా మిగిలిపోవడం ఖాయమని భావిస్తున్నారు.