లాభాలు వచ్చాయి… త్వరలోనే కొత్త నియామకాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల టీజీఆర్టీసీకి కొత్త ఊపొచ్చింది. ఈ పథకం మహిళల సాధికారతను పెంచడమే కాకుండా, ఆర్టీసీ కి లాభాలు తెచ్చిపెట్టే దిశగా మారిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్య నేపథ్యంలో కొత్త బస్సుల కొనుగోలు మరియు ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ కి రూ. 6500 కోట్ల విలువైన ఉచిత ప్రయాణ భర్తీ చేసినట్టు వెల్లడించారు. మహిళలు గౌరవంగా బస్సుల్లో ప్రయాణిస్తూ తమ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారని, ఈ పథకం వారి ఆర్థిక స్వావలంబనకు మార్గం వేసిందని మంత్రి పేర్కొన్నారు.