గాడిద బండ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణలు…
కర్నూలు జిల్లా కల్లూరులో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. ఉగాది సందర్భంగా చౌడేశ్వరి మాత దేవాలయం చుట్టూ బురదలో గాడిదలు, ఎద్దుల బండ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించడం ఆచారంగా వస్తుందని గ్రామస్థులు తెలిపారు. గాడిదలను రజకులు వారి ఇంటి నుంచి ఊరేగింపుగా గుడి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ బురదలో ప్రదక్షిణలు చేయించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.