Home Page SliderHoroscope TodayInternationalmoviesNews AlertTrending Todayviral

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ధోని…!వైరల్ అవుతున్న వీడియో!

రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమా బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, ఇది పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ పాత్ర ముఖ్యంగా యువతిని బాగా ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా కంటెంట్ విషయంగా కొన్ని వివాదాలను కూడా తెచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ పాత్రలో నటించారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది సినిమాలో కాదు, ఒక వాణిజ్య ప్రకటనలో జరిగింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ యానిమల్ తరహాలోనే, ధోని ఒక ఎలక్ట్రిక్ సైకిల్ వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఈ ప్రకటనలో యానిమల్ సినిమా తరహా యాక్షన్ సన్నివేశాలను రీక్రియేట్ చేశారు. సినిమాలో రణ్‌బీర్ కపూర్ వేసుకున్న దుస్తులు, జుట్టు కూడా ధోని ధరించాడు. రణ్‌బీర్ మాదిరిగానే ధోని కూడా పొడవాటి జుట్టుతో కనిపించాడు. ఆ మూవీ లోని కొన్ని సీన్స్ కూడా రెక్రీేట్ చేసారు. ఉదాహరణకు, రణ్‌బీర్ కపూర్ బైక్‌పై స్టైల్‌గా రష్మిక మందన్నాను కలవడానికి వస్తాడు. కానీ ఈ ప్రకటనలో ధోని ఎలక్ట్రిక్ సైకిల్‌పై వస్తాడు. సినిమాకు సంబంధించిన మిగతా యాక్షన్, ఫీల్ గేమ్ కూడా ఈ యాడ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 18న విడుదలైన ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.