Home Page SliderNational

ఢిల్లీలో రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ స్వాధీనం

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రెయిడ్‌లో ఇవాళ 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ ఢిల్లీలో రైడ్ చేసిన తర్వాత డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ భారీ కొకైన్‌ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ సిండికేట్‌ హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న ఇద్దరు ఆఫ్ఘన్ జాతీయులను అరెస్టు చేసిన తర్వాత దేశ రాజధానిలో మాదకద్రవ్యాల గుట్టురట్టయ్యింది.