International

సెమీస్‌లో చెలరేగిన స్మ్పతి , జెమీమాలు -ఇంగ్లాండ్ ముందు భారీస్కోర్

Share with

తాడో పేడో తేల్చుకోవాల్సిన కామన్వెల్త్ ఇండియా- ఇంగ్లాండ్ మహిళల క్రికెట్  కీలక సెమీఫైనల్స్‌లో భారత్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలో స్మ్పతి మంధాన 32 బంతుల్లో 61 పరుగులు చేసింది. మెరుపుతీగలా పరుగెడుతూ రన్స్ చేసింది. 8 ఫోర్స్, 3 సిక్సర్స్‌తో ఆరంభం నుండీ రెచ్చిపోయి ఆడింది. ఆఖరున జెమీమా రోడ్రిగ్స్ 31 బంతుల్లో 44 పరుగులు తీసి 7సూపర్ ఫోర్స్‌తో నాటౌట్‌గా నిలిచింది. వీళ్ల శ్రమ ఫలితంగా భారత్ కీలకమైన ఈ మ్యాచ్‌లో భారీస్కోర్ సాధించి టీమ్ విజయావకాశాలపై ఆశలు కలిగించింది. మెత్తం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు తీసి శభాష్ అనిపించుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ కెంప్ 2 వికెట్లు తీసింది.