InternationalNews

రష్యా నుంచి చమురు కొంటూనే ఉంటాం.. భారత్ క్లారిటీ

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మంగళవారం మాస్కోలో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు జరిపారు. భారతదేశం, రష్యా మధ్య అవసరాలు, సంబంధాల గురించి ఇరుదేశాల విదేశాంగ మంత్రులవు చర్చించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి రావాల్సి ఉందని… అందుకు రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అస్థిరత ఉన్న ఈ కాలంలో, మనం చేస్తున్నది చాలా మంచి పని అన్నారు ఉభయులు. చమురు, గ్యాస్ కొనుగోలులో మూడో అతిపెద్ద వినియోగదారుగా ఇండియా ఉంది. చమురు నిల్వలను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ఇండియా ఎల్లప్పుడూ భావిస్తోందన్నారు. కాబట్టి భారతదేశం-రష్యా సంబంధం మన ప్రయోజనానికి ఉపయోగపడుతుందని… దీన్ని భవిష్యత్‌లో కొనసాగిస్తామన్నారు.

సమర్కాండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చెప్పినట్లుగా ఇది యుద్ధ యుగం కాదన్నారు జైశంకర్. ఉక్రెయిన్ పరిణామాలను మనం చూస్తున్నాం. చర్చలకు తిరిగి రావాలని భారత్ గట్టిగా సలహా ఇస్తుందన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితిని ప్రపంచం మరచిపోకపోవడం చాలా ముఖ్యమని… అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఓవైపు ఉగ్రవాదం, మరోవైపు సామాన్య ప్రజల కష్టాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ముప్పుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా పొరుగు దేశాలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. రెండు దేశాల తాజా సమావేశం ద్వారా… ప్రపంచ పరిస్థితులపై రెండు దేశాలు పరస్పరం మాట్లాడుకోవాల్సి ఉందన్నారు. భారతదేశం, రష్యా ఒకదానికొకటి మరింతగా కలిసి పనిచేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.