NationalNews

మహారాష్ట్రలో మంత్రులుగా 18 మంది ప్రమాణం

Share with

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా రాష్ట్ర గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ నుంచి చంద్రకాంత్‌ పాటిల్‌, రాధాకృష్ణ విఖే పాటిల్‌, సుధీర్‌ ముంగంతివార్‌, సురేష్‌ ఖాడే, గిరీష్‌ మహాజన్‌, రవీంద్ర చౌహాన్‌, మంగల్‌ ప్రభాత్‌ లోధా, విజయ్‌ కుమార్‌ గావిట్‌, అతుల్‌ సావే శివసేన నుంచి దాదా భూసే, షంభురాజే దేశాయ్‌, సందీపన్‌ భుమ్రే, ఉదయ్‌ సామంత్‌, తారాజి సావంత్‌, అబ్దుల్‌ సత్తార్‌, దీపక్‌ కేసార్కర్‌, గులాబ్‌రావు పాటిల్‌, సంజయ్‌ రాథోడ్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కింది. మరో 2-3 వారాల్లో రెండోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని శివసేన సీనియర్‌ నేతలు తెలిపారు.