NationalNews

ఫైనల్‌లో భారత్‌,  ఆస్ట్రేలియా

Share with

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత మహిళల జట్టు మంచి ఫామ్‌తో రాణిస్తున్నారు.  మొత్తానికి జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది…  ఆగస్టు 8న (ఆదివారం) రాత్రి జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌, ఆస్ట్రేలియా ఢీ కొట్టనుంది. నువ్వా నేనా అనే రేంజ్‌లో మ్యాచ్‌ కొనసాగనుంది. ఉత్కంఠభరితంగా జరిగే మ్యాచ్‌ కోసం ఆడియన్స్‌ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.. భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో భారత్‌ ముందడుగు వేస్తోంది. భారత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్‌లు అత్యున్నత ఫామ్‌లో రాణిస్తున్నారు.. అటు బౌలింగ్‌లో చూస్తే రేణుకా సింగ్‌ ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతుంది. ఒకవేళ భారత్‌ గెలిస్తే.. చరిత్ర సృష్టించినట్లే.. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన తొలిసారే పతకం సాధించిన జట్టుగా భారత మహిళల జట్టు కొత్త రికార్డు నెలకొల్పనుంది.