InternationalNational

కామన్వెల్త్ క్రీడలు పరిసమాప్తి- పతకాల పట్టికలో ఇండియా 4 వ స్థానం

Share with

నాలుగేళ్లకొకమారు జరిగే ఆటల పండుగ కామన్‌వెల్త్ ఆటల్లో భారత్ క్రీడాకారులు వాయువేగంతో దూసుకుపోతున్నారు. జూలై 28 నుండి, ఆగస్టు 8 వరకూ బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ కామన్‌వెల్త్‌ క్రీడలలో దాదాపు 200 మంది భారత క్రీడాకారులు సుమారు 16 రకాల  క్రీడలలో ఎన్నో మెడల్స్ సాధించారు.

 వెయిట్ లిఫ్టింగ్‌లో 3 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మొత్తంగా 10 పతకాలు సాధించారు.

జూడోలో 2 రజత, 1కాంస్య పతకం మొత్తం 3 పతకాలు.

లాన్ బౌల్స్ 1 బంగారు, 1 రజత పతకం మొత్తం 2.

టేబుల్ టెన్నిస్ 2 బంగారు, 1 రజత పతకం లభించింది.

బాడ్మింటన్‌లో 1 రజత, 2 కాంస్య పతకాలు సాధించారు.

స్వాష్‌లో 2 కాంస్యపతకాలు వచ్చాయి.

పారాపవర్ లిఫ్టింగ్‌లో 1 బంగారు లభించింది.

అథ్లెటిక్స్‌లో 1 బంగారు, 4 రజత, 3 కాంస్య పతకాలతో మొత్తం 8 పతాకాలు వచ్చాయి.

రెజ్లింగ్‌లో 6 బంగారు, 1 రజత, 5 కాంస్య పతకాలు కలిసి అత్యధికంగా 12 పతాకాలు లభించాయి.

బాక్సింగ్‌లో 3 బంగారు, 1 రజత, 3 కాంస్య పతకాలతో 7 పతకాలు సాధించారు.

పారా టేబుల్ టెన్నిస్‌లో 1 బంగారు, 1 కాంస్య పతకం లభించాయి.

హాకీలో1 కాంస్య పతకం లభించింది.

క్రికెట్‌లో 1 రజత పతకం లభించింది. ఇప్పటివరకూ భారత్ మొత్తం 55 పతకాలు సాధించి పతకాలలో 4 వస్థానంలో నిలిచింది. ప్రధమ, ద్వితీయ స్థానాలలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నిలిచాయి.