పొరపాటు జరిగితే నా శవం చూస్తారు, మార్కాపురం టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
మార్కాపురం ఎన్నికల సభలో టీడిపి అభ్యర్ధి కందుల నారాయణరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇవే తనకు ఆఖరి ఎన్నికలకు తేల్చి చెప్పారు. ఈ సారి మార్కాపురం ప్రజలు తనను ఆశీర్వదించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా పొరపాటు జరిగితే తన శవాన్ని చూడాల్సి వస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఈసారి ఎన్నికల్లో విజయంపై టీడీపీ కూటమి-వైసీపీ దీమాగా ఉన్న తరుణంలో ఎన్నికల్లో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ రెండు వర్గాల నేతల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో మార్కాపురంలో హోరాహోరీ తప్పదన్న సంకేతాల నడుమ టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయ్.
గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో సాదుకుంటారో, సంపుకుంటారో మీ ఇష్టం, గెలిస్తే విజయయాత్ర, లేదంటే శవయాత్ర అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా. ఆయన ఆ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఓడించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు కందుల నారాయణ రెడ్డి సైతం ఇదే తరహాలో వ్యాఖ్యానించారన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.