Andhra PradeshHome Page Slider

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది కేంద్రమే-అశోక్

Share with

రాజమండ్రి, టి.నగర్‌: రాష్ట్రంలో సైకో సీఎం పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని.. దీనిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం ఇంకా ఎన్నిరోజులు గమనిస్తుందో చూద్దాం.. రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ప్రమాణం చేశారు. దానిని అమలు చేయమని కోరుతున్నాం అని వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులతో శుక్రవారం రాజమండ్రి వచ్చిన ఆయన చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్థిక నేరాల్లో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల హక్కులను హరిస్తూ, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశారని.. ఒక్క అత్యాచారం సెక్షన్ తప్ప అన్ని సెక్షన్లు పెట్టారన్నారు. జైలులో ఉన్న వ్యక్తులకు ప్రభుత్వమే సదుపాయాలు కల్పించాలన్నారు. ఆర్థిక నేరాల్లో జగన్‌ను సీబీఐ పలు దఫాలు విచారించి, నేరం జరిగిందని నిర్ధారించాకే కారాగారంలో వేసిందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్, సుజయ్‌కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు.