Home Page SliderNational

ప్రశాంత్ కిషోర్‌కు బీజేపీ డబ్బులిస్తోందా..తేజస్వీ యాదవ్ ఏమన్నారంటే… !?

Share with

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ శుక్రవారం ‘బీజేపీ ఏజెంట్’ అని అభివర్ణించారు. బిజెపి ఎన్నికలలో ఓడిపోతోంది, కాబట్టి మూడు-నాలుగు ఫేజుల ఓటింగ్ తర్వాత పిలిపించారని ఆరోపించారు బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి. పీకే ఇప్పుడు తన సొంత పార్టీ – జన్ సూరాజ్ ద్వారా ప్రజల్లో ఉన్నాడు. అనేక పార్టీలకు ప్రచారాలను నిర్వహించడమే కాకుండా, నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్)లో కూడా అతను నంబర్ 2గా ఉండేవాడు. అమిత్ షా కోరిక మేరకే ప్రశాంత్ కిషోర్‌ను జాతీయ ఉపాధ్యక్షుడిని (జేడీయూ) చేశానని మా మామ నితీష్ కుమార్ గతంలో చెప్పారన్నారు. ఇప్పటి వరకు అమిత్ షా గానీ, ప్రశాంత్ కిషోర్ గానీ ఆ వాదనను ఖండించలేదు. పీకే మొదట్నుంచి ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ దెబ్బతింటుందని తేజస్వీ యాదవ్ అన్నారు.

2020లో నితీష్ కుమార్-ప్రశాంత్ కిషోర్ మధ్య విభేదాలతో రచ్చ జరిగిందని గుర్తు చేశారు. వాస్తవానికి పీకేను హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు పార్టీలో చేర్చుకున్నానని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారన్నారు. పీకే జీతాలు తీసుకునే జిల్లా అధ్యక్షులను బీహార్ లో నియమించారని, ఇలాంటి పరిస్థితి బీజేపీలో కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. పీకేకు అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదన్నారు. ప్రతి సంవత్సరం వేర్వేరు వ్యక్తులతో పని చేస్తూనే ఉంటాడని… ఒకరి డేటాను తీసుకొని మరొకరికి ఇస్తాడన్నారు. పీకే కేవలం బిజెపి ఏజెంట్ మాత్రమే కాదని వారి మైండ్ అంటూ మండిపడ్డారు. బీజేపీ సిద్ధాంతాలను అనుసరిస్తాడని, వారి వ్యూహంలో భాగంగా నిధులను సమకూరుస్తోందని తేజస్వి యాదవ్ అన్నారు. బిజెపి తమ జాతీయ అధికార ప్రతినిధిగా పీకేను నియమించుకుందని ఫేక్ స్క్రీన్‌షాట్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.