Home Page SliderTelangana

లిక్కర్ స్కామ్‌లో కవితకు బెయిల్ ఇప్పుడప్పుడే కష్టమేనా?

Share with

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవిన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కోర్టు బెయిల్ తిరస్కరించింది. కవిత పిటిషన్లపై గత నెలలో కోర్టు విచారించింది. ఇవాళ రెండు పిటిషన్లను డిస్మిస్ చేస్తూ కోర్టు తీర్పిచ్చింది. దీంతో రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు తర్వాత కవిత తీహార్ జైల్లో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే సోమవారం మే13న జరగనున్న తరుణంలో కవితకు బెయిల్ వస్తే, పార్టీకి అడ్వాంటేజ్ కలుగుతుందనుకుంటున్న సమయంలో నిరాశ ఎదురయ్యింది. మొత్తంగా కేసు విచారణ నెమ్మదిగా సాగుతుండటంతో, బెయిల్ ఎప్పుడొస్తుందోనన్న టెన్షన్ లో బీఆర్ఎస్ వర్గాలున్నాయి. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విజయం ద్వారా తిరిగి పునర్వైభవం సాధించాలని బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఏమవుతాయోనన్న టెన్షన్‌లో నేతలున్నారు.