వేధిస్తే పోలీసులకు చెప్పండి:మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు, ఆన్‌లైన్‌లో లోన్ తీసుకోని తిరిగి తీర్చే క్రమంలో వడ్డీలు కట్టలేక చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది లోన్ యాప్ వేధింపులు ప్రముఖులకు సైతం తప్పడం లేదు.లోన్ తీసుకున్నవారే కాదు వారి ఫోన్ లోని కాంటక్ట్ లిస్ట్ లో ఉన్న ప్రముఖులు కూడా బాధితులుగా మారే అవకాశముందని నెల్లూరు ఘటనతో తేలిపోయింది. అశోక్ కూమార్ అనే వ్యక్తి 8.50 లక్షలు లోన్ తీసుకున్నారు ప్రత్యామ్నాయంగా మీ నెంబర్ ఇచ్చారు,ఇప్పుడు మీరు లోన్ కట్టండి అంటూ రికవరి ఏజెంట్లు దగ్గరి నుంచి మంత్రి కాకాణికి దాదాపు 79 కాల్స్ వచ్చాయి పీఏ ఆ కాల్స్ ని బ్లాక్ చేశారు. వివరాలు మంత్రికి చెప్పారు అయితే మంత్రి కాకాణి ఈ వ్యవహారాన్ని అక్కడితో వదలాలనుకోలేదు.లోన్‌యాప్ ముఠాను ట్రాప్ చేసేందుకు కాకాణి తన పీఏ తో రికవరీ ఏజెంట్లుకు 25,000 రూపాయలు చెల్లించి, ఈ విషయంలో అసలు సంగతేంటో తేల్చాలంటూ ఎస్పీ విజయరావుకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి కాకాణికి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా వలపన్ని నలుగురిని అరెస్ట్ చేశారు
ఈ కేసుకి సంబంధించి కోల్ మాన్ అనే ఏజెన్సీ తరపున రికవరీ ఏజెంట్లు, స్థానిక ఫైనాన్స్ ఏజెన్సీకి చెందినవారిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. నలుగురులో ఒక మహిళ కూడా ఉన్నారు. ఐటీ యాక్ట్ కింద కూడా వీరిపై కేసులు నమోదు చేశామన్నారు. లోన్ తీసుకున్నవారికి ఫోన్ చేయాలి కానీ, వారి ఫోన్ బుక్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్నింటికీ ఫోన్లు చేసి బెదిరించడం సరికాదంటున్నారు ఎస్పీ విజయరావు. నెల్లూరు కేసు విషయానికొస్తే లోన్ తీసుకున్న వ్యక్తి ఫోన్ బుక్ లో మంత్రి నెంబర్ లేకపోయినా ఇంటర్నెట్ లో జిల్లాలోని ప్రముఖులు నెంబర్లు సెర్చ్ చేసి, మంత్రికి ఫోన్ చేశారని వివరించారు. ఆన్ లైన్ లో లోన్ తీసుకునే సమయంలో ప్రతిదానికీ ఓకే అని చెప్పొద్దని, కాస్త ఆలోచించి లోన్లు తీసుకోవాలని సూచించారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు. లోన్లు రికవరీ పేరుతో అప్పు తీసుకున్నవారిని ఫోన్ కాల్స్ ద్వారా కానీ, మరో రూపంలో కానీ వేదిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. లోన్ రికవరీ ఏజెంట్ల వద్ద సిమ్ కార్డ్ లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటి ద్వారా మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు