News

ఆర్మీ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Share with

సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు రేవంత్. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని ఆయన అభినందించారు. కృషి అంకితభావం విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చుతాయన్నారు. ఈ రోజు నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని… జీవితంలో మరిన్రని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. సక్సెస్ ఆస్వాదించాలని, ఐతే బాధ్యతను మరిచిపోవద్దన్నారు. మీరు చేసే పనులు మీకు, మీకుటుంబానికే కాదు మీ కాలేజ్ కు గుర్తింపును తీసుకొస్తాయన్నారు. సైనికుల పిల్లలకు సేవలందించడం మన సైన్యానికి, దేశానికి గర్వకారణమన్నారు.