గాంధీని అవమానించే పరిస్థితి ఏర్పడింది : సీఎం
అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా ప్రారంభించారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… సుదీర్ఘకాలం స్వయంపాలనలో సుసంపన్నమైన భారతదేశలో తరాలు మారుతున్నాయ్… కొత్త తరాలు వస్తున్నాయ్. వారికి స్వాతంరత్య పోరాట సమయంలో జరిగిన సమరం, త్యాగాలు కొత్త తరానికి తెలియవు అని, రాబోయే తరాలకు స్వాతంత్ర్య పోరాటాలు తెలియాలన్నారు సీఎం. భారత స్వాతంత్ర్యం కూడా సుదీర్ఘమైన పోరాటమని, అనేక మంది పెద్దలు అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాటాలు చేశారన్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి, దేశంలో మహాత్మాగాంధీని అవమానించే పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ కొనియాడారు. ఈ ఉత్సవాలు 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనున్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.