Home Page SliderNational

కదులుతున్న రైలు నుంచి మహిళను కాపాడారు..

కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు మహిళ కిందపడిపోతూ ఉంటే అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది చాకచక్యంగా ఆమెను కాపాడారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బోరివలి రైల్వే స్టేషన్‌లో జరిగింది. కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ఒక మహిళ బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. అక్కడ ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది ఆమెను కాపాడారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు, దిగేందుకు ప్రయత్నించవద్దని పదే పదే రైల్వే అధికారులు సూచిస్తున్న ప్రయాణికులు జాగ్రత్తగా వహించట్లేదని నెటిజన్లు అంటున్నారు. రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/ChotaNewsApp/status/1898584277761085779