Home Page SliderNews AlertTelangana

పండుగ రోజున వైన్స్‌, బార్లు బంద్‌

హైదరాబాద్‌ మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌. శ్రీరామనవమి పండుగ సందర్భంగా నగరంలో మార్చి 30న వైన్‌ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్‌లు, పబ్‌లతో పాటు ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో బార్‌ రూమ్స్‌ మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసి వేయనున్నారు.  శాంతి భద్రతల కారణంగా మద్యం షాపులను పండుగ సందర్భంగా మూసివేయాలని మద్యం షాపులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.