Andhra PradeshHome Page Slider

ఏపీలో ఎవరు గెలుస్తారు? కేసీఆర్ ఏమన్నారంటే..!?

ఏపీలో ఎవరికి అదృష్టం ఉంటే వారు గెలుస్తారన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏపీలో ఏం జరిగినా తమకు పట్టింపు లేదన్నారు. వస్తున్న సమాచారం ప్రకారం జగన్ గెలుస్తారని తెలుస్తోందన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ టీవీ9కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తెలంగాణ, దేశ రాజకీయాలతోపాటుగా, ఏపీ విషయంపై ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఏపీలో ఎవరు గెలవాలన్నదానిపై తనకు ప్రత్యేకమైన కోరిక ఏమీ లేదన్నారు. ఎవరు గెలిచినా బాధలేదన్నారు. ఎవరికో ఒకరికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు. వాళ్ల రాష్ట్రంలో వాళ్లు రాజకీయం చేస్తున్నారన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం జగన్ గెలుస్తున్నారన్నారు. ప్రస్తుతానికి ఏపీ విషయంలో తాము జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఆ విషయాన్ని రాబోయే రోజుల్లో చూసుకుంటామన్నారు.