కాంగ్రెస్ పార్టీలోకి విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు?
వైసీపీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరు తమ దారి తాము చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ రాదన్న భావనతో ఒక్కొక్కరు పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే తాను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ మంగళగిరి ఎమ్మెల్యే ప్రకటించడంతో, తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం కాంగ్రెస్ పార్టీ గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. తాజాగా ఈ సీటును వైసీపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించగా, వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు కేటాయించవచ్చని తాజాగా ప్రచారం జరుగుతోంది.


