Home Page SliderNational

దేశంలోనే అత్యధిక పారితోషకంతో నెంబర్ ఒన్‌గా విజయ్-రాజకీయాలపై కూడా కన్ను

తమిళ స్టార్ హీరో విజయ్‌ కొత్త రికార్డు సృష్టించాడు. భారత్‌లోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుడిగా నిలిచాడు. ఆయన కొత్త చిత్రం లియో కి 175 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు తమిళ సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇది బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పారితోషకం కంటే కూడా చాలా ఎక్కువ. షారుఖ్ రెమ్యూనరేషన్ 150 కోట్లు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్స్ ప్రభాస్, మహేశ్ బాబులు 100 కోట్లతో, అల్లు అర్జున్ 90 కోట్ల పారితోషకంతో లీడ్‌లో ఉన్నారు. ఐదు పదులు దగ్గర పడుతున్న విజయ్ చూపు రాజకీయాల వైపు మళ్లుతున్నట్లు సమాచారం. కొత్త ఐడియాల కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో అగ్రిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తమిళ వర్గాలు అనుకుంటున్నారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టినా అధికారంలోకి రావడం చాలా కష్టమని అంటున్నారు. ఏఐడీఎంకే పార్టీ మూడు ముక్కలుగా విడిపోతోందని, అందుకని అది అడ్వాంటేజ్ అవుతుందని విజయ్ భావిస్తున్నారట.