Home Page SliderTelangana

తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు తీపి కబురు చెప్పింది. వారానికి రెండు రోజులు పాటు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల లేఖలను అనుమతించనున్నట్టు పేర్కొంది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు లేఖలు అందించినా ఫలితం లేకుండా పోయాయి. తమ లేఖలను కూడా అనుమతించాలని ఇటీవలే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. తెలంగాణలోని దేవాలయాలకు వస్తే తాము అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, అలాగే తిరుమలలోనూ వర్తింపజేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ సర్కారుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తాజాగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజుల పాటు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో ప్రత్యేక దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించింది.