Home Page SliderNational

రాజకీయ పార్టీలకు ఎలక్షన్ బాండ్ల ద్వారా విరాళాలిచ్చిన టాప్ 10 కంపెనీలు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఈరోజు ఎస్‌బీఐ నుంచి పొందిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను అప్‌లోడ్ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏప్రిల్ 12, 2019 – ఫిబ్రవరి 15, 2024 మధ్య కొనుగోలు చేసిన మరియు రీడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటాకు సంబంధించిన వివరాలివి. ఈ కాలంలో మొత్తం 22,217 బాండ్లను కొనుగోలు చేసినట్లు SBI సుప్రీంకోర్టుకు తెలిపింది. గత ఐదేళ్లలో రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసిన రూ.12,769 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లలో దాదాపు సగభాగాన్ని పాలక బీజేపీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది.

రాజకీయ పార్టీలకు టాప్ 10 విరాళాలు కంపెనీలు
ఫ్యూచర్ గేమింగ్ & హోటల్ సర్వీసెస్ PR – ₹ 1,368 కోట్లు
మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ – ₹ 966 కోట్లు
Qwik సప్లై చైన్ Pvt Ltd – ₹ 410 కోట్లు
వేదాంత లిమిటెడ్ – ₹ 400 కోట్లు
హల్దియా ఎనర్జీ లిమిటెడ్ – ₹ 377 కోట్లు
భారతి గ్రూప్ – ₹ 247 కోట్లు
ఎస్సెల్ మైనింగ్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ – ₹ 224 కోట్లు
వెస్ట్రన్ UP పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ – ₹ 220 కోట్లు
కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ – ₹ 195 కోట్లు
మదన్‌లాల్ లిమిటెడ్ – ₹ 185 కోట్లు