Home Page SliderTelangana

ఎమ్మెల్యేకి బెదిరింపు లేఖ.. నిందితులు అరెస్ట్..

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కి మావోయిస్టుల బెదిరింపు లేఖ కలకలం రేగింది. ఈ కేసులో ఊహించని కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పేరిట లేఖ రాసిన నిందితులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో A1 షేక్ రఫీ తో పాటు కుమ్మరి భగవంతు , మహమ్మద్ షా అలీలను అదుపులోకి తీసుకున్నామని, మరో నిందితుడు షేక్ తౌఫిక్ పరారీలో ఉన్నట్లుగా ఎస్పీ జానకి వెల్లడించారు. అయితే, కేసులో ప్రధాన నిందితుడు షేక్ రఫీ గతంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దగ్గర పని చేశాడని తెలిపారు. అనంతరం అక్కడ పని మానేశాక ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఎలాగైనా.. ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించాలనే కుట్రతో మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రాశారని పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుల నుంచి 29 డూప్లికేట్ లెటర్ ప్యాడ్స్, 3 సెల్ ఫోన్ లను, ఓ టూ వీలర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జానకీ తెలిపారు.