కరెంట్ పోవడం వల్లే ఇలా జరిగింది-TTD
తిరుమల ఆలయదృశ్యాలు వీడియో తీసిన విషయం సంచలనం అయిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై TTD విజిలెన్స్ విభాగం స్పందించింది. రాత్రి వర్షం వల్ల కరెంట్ పోయిందని, ఆ సమయంలో స్కానింగ్ యంత్రాలు పనిచేయకపోవడం వల్లనే ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. వీలైనంత తొందర్లోనే ఆనంద నిలయం వీడియో తీసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ప్రకటించింది. విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ మాట్లాడుతూ ప్రతి భక్తునికీ ఎలక్ట్రానిక్ పరికరాలు ఆలయంలోకి తీసుకెళ్లడం నేరమనే సంగతి తెలుసని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వాన పడడంతో దాదాపు రెండు గంటలు కరెంట్ సరఫరా నిలిచిపోయిందని, ఆ సమయంలో దర్శనానికి వెళ్లినవారిలో ఎవరో పెన్ కెమెరాతో ఈ పనికి పాల్పడ్డారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ భక్తుడిని గుర్తించి చర్యలు చేపడతామని తెలిపారు.

