డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఏపీలోని డీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణను ఇప్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ శిక్షణలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలలో 6 ఐటీడీఏలలో, గిరిజనేతరుల ప్రాంతాలలో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ కోసం ఒక్కో అభ్యర్థి మీద రూ. 25 వేలు ఖర్చవుతాయని అంచనా. ఈ సంవత్సరం డీఎస్సీకి 16,347 పోస్టులను ప్రకటించారు.

