యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని ఆరోరా డీమ్డ్ యూనివర్సిటీలో 250 మంది ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు 10 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం ప్రొఫెషనల్ సర్టిఫికెట్ల కోసం అదనంగా రూ.50,000 డిమాండ్ చేస్తోందని, 100% ప్లేస్‌మెంట్ హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రార్ చంద్రశేఖర్ హేళనగా మాట్లాడారని, న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు.

