Breaking NewsHome Page SliderLifestyleSpiritualTelangana

ఆల‌యంలో షూటింగ్ వివాదం.. అధికారులపై వేటు.

శ్రీకాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో సింగర్ మధుప్రియ సాంగ్ షూటింగ్‌ వివాదంలో మీడియా ప్రసారం చేసిన కథనాలపై తెలంగాణ దేవాదాయశాఖ స్పందించింది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈవో మారుతిపై బదిలీ వేటు వేసింది. మారుతి స్థానంలో కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయానికి గతంలో ఈవోగా పనిచేసి కొడవటంచ లక్ష్మీనరసింహ దేవస్థానానికి బదిలీ అయిన గ్రేడ్-1 అధికారి మహేశ్‌కు మళ్లీ బాధ్యతలు అప్పగించారు.అలాగే షూటింగ్ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడు రామకృష్ణకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా, ఈనెల 20న అనుమతి లేకుండా ముక్తేశ్వర ఆలయ గర్భగుడిలో సింగర్ మధుప్రియ ప్రైవేటు ఆల్బమ్ షూటింగ్ చేశారు. దీనిపై తీవ్ర వివాదం చెలరేగింది. సాధారణంగా కాళేశ్వర ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి ఉండదు. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండా మధుప్రియ పాటలు చిత్రీకరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వివాదంపై పెద్దఎత్తున విమర్శలు రావ‌డంతో ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.