ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఎస్ఐ మృతి
కర్ణాటకలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని కగ్గలిపుర మూలమలుపు వద్ద జరిగింది. కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. బస్సు అధిక వేగంతో ఉండటంతో రెండు బైక్లను ఢీకొట్టి నాలాలో పడిపోయింది. ఈ విషాదకర ఘటనలో ఓ ఎస్ఐ తో పాటు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఉన్న ఆసుపత్రికి స్థానికులు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

