పాక్ నటుడి సినిమాపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ సినిమా రిలీజ్ భారత్‌లో నిషేధించడంపై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ సినిమాను నిషేధించకూడదని, ఎలాంటి సినిమా అయినా నిషేధించడాన్ని తాను సమర్థించనని పేర్కొన్నాడు. అంతేకాక కేవలం అశ్లీలత, పిల్లలపై వేధింపులు ఉన్న సినిమాలు మాత్రమే నిషేధించాలని, మిగతా సినిమాలు జనాల నిర్ణయానికే వదిలివేయాలన్నాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టడాన్ని విమర్శిస్తున్నారు. కశ్మీర్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ప్రజలను వారి దేశానికి పంపించివేయడం, సింధూ జలాల నిలిపివేత, పాక్ సోషల్ మీడియా ఖాతాల నిషేధం వంటి అనేక చర్యలను ఇప్పటికే భారత ప్రభుత్వం పాటిస్తోంది.

