Home Page SliderNationalNews

అమెజాన్‌లో ఇకపై వైద్యసేవలు

ఆన్‌లైన్ షాపింగ్ యాప్ అమెజాన్ ద్వారా ఇకపై వైద్యసేవలు అందుతాయని సంస్థ వెల్లడించింది. అమెజాన్ క్లినిక్‌ పేరుతో యాప్ భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ యాప్ ద్వారా 50కి పైగా వైద్య సమస్యలకు తక్కువ ధరలో వైద్యుల కన్సల్టేషన్ దొరికే సదుపాయం అందిస్తోంది. నేరుగా యాప్ ద్వారా వైద్యనిపుణులతో అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకోవచ్చు. రూ.299తో ఈ సర్వీస్ మొదలు అవుతుంది. మొబైల్‌లో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. దీనిద్వారా డెర్మటాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ వంటి విభాగాలు ఉన్నాయి. ఈ డాక్టర్లకు కనీసం మూడేళ్ల అనుభవం ఉంటుంది. అంతేకాదు, మందులు కూడా అమెజాన్ ఫార్మసీ స్టోర్ ద్వారా మందులు కూడా కొనుగోలు చేయవచ్చు.