శివాలయంలో మహా అన్నదానం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శాంతినగర్ కాలనీకి చెందిన దాత సొంజికే శ్రీరామ – సులోచన దంపతులు స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్నరాములు, కుమ్మరి కృష్ణ, సభ్యులు తోకల కిరణ్, చిట్ల ప్రవీణ్, కుమ్మరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

