తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అరవింద్ కేజ్రివాల్ దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆప్ పార్టీ స్థాపించి, సీఎం అయ్యాక మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేజ్రీవాల్. నిన్న ఆయన కుటుంబంతో కలిసి హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి ఇండిగో విమానంలో రేణిగుంటకు వచ్చారు. రాత్రి తిరుమలతో బస చేసి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ పలువురు ప్రముఖులు కూడా తిరుమలేశుడిని దర్శించుకున్నారు.

