Home Page SliderNewsPoliticsTelangana

కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరు

కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా, మాజీ ముఖ్యమంత్రి మరియు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్) నేడు విచారణకు హాజరయ్యారు.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తలెత్తిన నిర్మాణ లోపాలపై కేసీఆర్‌ను కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే పలు కీలక అధికారులు, మాజీ మంత్రులను విచారించిన కమిషన్, ఈరోజు కేసీఆర్‌ను కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయబోతోంది. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు విచారణకు హాజరయ్యారు. ఇటీవల మాజీ మంత్రులు ఈటల రాజేందర్ (జూన్ 6), హరీశ్ రావు (జూన్ 9) విచారణకు హాజరైన నేపథ్యంలో, ఇప్పుడు కేసీఆర్ కూడా హాజరవడం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద గణనీయమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకోగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసులు భద్రత కోసం మొహరించారు. భవన పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉన్నట్లు సమాచారం.